Modi: పవిత్రమైన రోజున అద్భుతమైన ప్రజల మధ్య ఉన్నాను..!

ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్రమోదీ నేపాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ రోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు.

Updated : 16 May 2022 16:51 IST

నేడు నేపాల్‌లో పర్యటిస్తోన్న మోదీ

కాఠ్‌మాండూ: ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్రమోదీ నేపాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ రోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో కలిసి పూజలు నిర్వహించారు. దేవ్‌బా ఆహ్వానం మేరకు మోదీ నేపాల్‌ వెళ్లారు. 2014 నుంచి ప్రధాని ఆ దేశం వెళ్లడం ఇది ఐదోసారి. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీ నగర్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మోదీ నేపాల్‌ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం లుంబినిలో దిగిన ప్రధానిని దేవ్‌బా సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘నేపాల్‌లో అడుగుపెట్టాను. బుద్ధపూర్ణిమ రోజున అద్భుతమైన నేపాల్ ప్రజల మధ్య ఉండటం ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే పవిత్రమైన మాయాదేవీ ఆలయంలో ప్రార్థనలతో మోదీ నేపాల్ పర్యటనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.  ఈ పర్యటనలో భాగంగా బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రానికి ఆ దేశ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బాతో కలిసి శంకుస్థాపన చేస్తారు. నేపాల్‌ ప్రభుత్వం నిర్వహించే బుద్ధ జయంతి వేడుకల్లోనూ పాల్గొంటారు.  బౌద్ధమతానికి చెందిన పవిత్ర ప్రదేశాల్లో లుంబిని కూడా ఒకటి. ఇది బుద్ధుడి జన్మస్థలం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని