Corona: ముంబయిలో 2 నెలల తర్వాత మళ్లీ పెరిగిన కొవిడ్‌ కేసులు

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు నెలల తర్వాత అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదు.....

Published : 04 May 2022 22:07 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు నెలల తర్వాత అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ముంబయిలో 7,035 మందికి పరీక్షలు చేయగా.. 117 మందిలో వైరస్‌ వెలుగు చూసింది. తాజాగా మరణాలేమీ నమోదు కాలేదని.. పాజిటివిటీ రేటు 1.66 శాతంగా ఉందని  అధికారులు తెలిపారు. తాజా కేసులతో నగరంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 642కి పెరిగింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 188 కరోనా కేసులు నమోదు కాగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1049కి చేరింది. ఫిబ్రవరి 24న ముంబయిలో అత్యధికంగా 119 కొత్త కేసులు రాగా.. తాజాగా మళ్లీ దాదాపు అదే స్థాయిలో కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

దిల్లీలో 5,853కి చేరిన యాక్టివ్‌ కేసులు

దేశ రాజధాని నగరం దిల్లీలోనూ బుధవారం భారీగా కొత్త కేసులు వెలుగుచూశాయి. 24 గంటల వ్యవధిలో 17,732 మందికి పరీక్షలు చేయగా.. 1,354 మందిలో వైరస్‌ వెలుగుచూసినట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా కొవిడ్‌తో ఒకరు చనిపోయినట్టు తెలిపారు. తాజాగా 1486 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. పాజిటివిటీ రేటు 7.64 శాతంగా ఉందని తెలిపారు. దిల్లీలో క్రియాశీల కేసుల సంఖ్య 5,853కి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని