కశ్మీర్‌లో ఉగ్రవాదం తర్వాత పెద్ద సవాల్‌ అదే..!

పాక్‌ ముష్కరుల దుశ్చర్యలతో నిత్యం తూటా పేలుళ్లతో దద్ధరిల్లే జమ్మూకశ్మీర్‌ మరో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడించారు........

Published : 01 Jan 2021 18:06 IST

డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడి

జమ్మూ: పాక్‌ ముష్కరుల దుశ్చర్యల కారణంగా నిత్యం తూటా పేలుళ్లతో దద్ధరిల్లే జమ్మూకశ్మీర్‌ మరో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తర్వాత అతిపెద్ద సవాల్‌గా మాదకద్రవ్యాల అక్రమ రవాణా మారిందని ఆయన‌ వెల్లడించారు. 2020లో జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1600 మందికి పైగా అనుమానిత డ్రగ్‌ వ్యాపారులను అరెస్టు చేసినట్టు తెలిపారు. గతేడాది మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డ్రైవ్‌ నిర్వహించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా 1132 కేసులు నమోదు చేసి 1672మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వీరిలో 35మంది మాదకద్రవ్యాల వ్యాపారులపై ప్రజా సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

ఈ మాదకద్రవ్యాలు ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు దోహదంచేయడమే కాకుండా యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌ వ్యాపారుల నుంచి 152.18కిలోల హెరాయిన్‌, 563.61 కిలోల గంజాయి, 22,230 కిలోల నల్లమందుతో పాటు మరికొన్ని డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి..

నేనేం తప్పు చేశా.. ఎందుకు అన్యాయం చేస్తున్నావ్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని