IIT-M: కరోనా హాట్‌స్పాట్‌గా ఐఐటీ-మద్రాస్‌.. మరో 25మందికి పాజిటివ్‌

మద్రాస్‌ ఐఐటీలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తుండటంతో .....

Published : 24 Apr 2022 01:37 IST

చెన్నై: మద్రాస్‌ ఐఐటీలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తుండటంతో ఈ క్యాంపస్‌ కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. శనివారం మరో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 55కి పెరిగినట్టు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జె.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు క్యాంపస్‌లో 55 పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు. ఈ శాంపిల్స్‌ అన్నింటినీ జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ కోసం పంపినట్టు తెలిపారు. రెండు మూడు వారాల్లో నివేదికలు వస్తాయని చెప్పారు.

మరోవైపు, క్యాంపస్‌లోని వివిధ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల్ని ఆయన పరామర్శించారు. కేసులు పెరుగుతుండటంతో ఎవరూ భయపడొద్దని సూచించారు. ‘‘భయం అక్కర్లేదు. మీ భద్రత కోసం ఐఐటీ-ఎం అన్ని చర్యలూ తీసుకుంది. ఇక్కడికి మూడు కి.మీల పరిధిలో ఉన్న ఆస్పత్రిని రిజర్వు చేసింది. ఈ సమయంలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కానీ, అతి విశ్వాసం పనికిరాదు’’ అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూనే ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని