డేటా ప్రైవసీకి భంగం కలగదు

ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)లో భాగంగా ప్రజలు అందించే వ్యక్తిగత ఆరోగ్య సమాచారం భద్రంగానే ఉంటుందని కేంద్రం తెలిపింది.

Published : 02 Feb 2021 19:33 IST

నేషనల్ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ భద్రమేనన్న కేంద్రం
రాజ్యసభలో వెల్లడి

దిల్లీ: ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)లో భాగంగా ప్రజలు అందించే వ్యక్తిగత ఆరోగ్య సమాచారం భద్రంగానే ఉంటుందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 6,30, 478 గుర్తింపు కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని కేంద్రం తెలిపింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారమంతా ఒకే చోటుకు చేర్చేందుకు ప్రభుత్వం ఎన్డీహెచ్‌ఎంను ప్రారంభించింది. గతేడాది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇవీ చదవండి..

ఈ మెగా డేట్స్‌ గుర్తుపెట్టుకోండి..

మరింత తగ్గిన పసిడి ధర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని