రామభక్తులపై దాడిచేస్తే సరైన సమాధానమిస్తాం!

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు సేకరిస్తున్న రామభక్తులపై దాడులకు పాల్పడిన వారికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తగిన సమాధానం చెబుతుందని భాజపా ఎంపీ, సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ హెచ్చరించారు. మతసామరస్యాన్ని, అశాంతిని రెచ్చగొట్టేందుకే కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి పనులకు ..

Published : 04 Jan 2021 19:38 IST

భాజపా ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌

ముంబయి: శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు సేకరిస్తున్న రామభక్తులపై దాడులకు పాల్పడిన వారికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తగిన సమాధానం చెబుతుందని భాజపా ఎంపీ, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ హెచ్చరించారు. మతసామరస్యాన్ని, అశాంతిని రెచ్చగొట్టేందుకే కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి పనులకు పూనుకొంటున్నాయని అన్నారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మాలేగావ్‌ బాంబుపేలుళ్ల విచారణలో భాగంగా ముంబయిలోని స్పెషల్‌ ఎన్ఐఏ న్యాయస్థానం ఎదుట ఆమె నేడు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులుండగా.. ఇప్పటి వరకు సమీర్‌ కులకర్ణి, అజయ్‌ రాహిర్‌కర్‌,  ప్రసాద్‌ పురోహిత్‌ మాత్రమే విచారణకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

2008 సెప్టెంబర్‌ 29న గుజరాత్‌, మహారాష్ట్రలో వరుస బాంబుపేలుళ్లలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 80 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 9మంది చనిపోగా, గుజరాత్‌లోని మొదసాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ నిందితురాలిగా ఉన్నారు.

ఇదీ చదవండి

రెండు స్టార్‌ హోటళ్లు.. 100మందికిపైగా కరోనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని