వైరస్‌పై వ్యాక్సిన్‌ వార్‌కు ‘క్వాడ్‌’ సిద్ధం..!

చైనా ప్రపంచం మీదకు వదిలిన వైరస్‌ను ఓడించేందుకు క్వాడ్‌ కూటమి దేశాధినేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలు భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ శక్తిని పెంచి ప్రపంచ దేశాలను ఆదుకోవాలని భావిస్తున్నాయి. క్వాడ్‌ కూటమిలోని భారత్‌, అమెరికా,

Updated : 10 Mar 2021 12:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ప్రపంచం మీదకు వదిలిన వైరస్‌ను ఓడించేందుకు క్వాడ్‌ కూటమి దేశాధినేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలు భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ శక్తిని పెంచి ప్రపంచ దేశాలను ఆదుకోవాలని భావిస్తున్నాయి. క్వాడ్‌ కూటమిలోని భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాధినేతలు త్వరలో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్ ఇటీవల ధ్రువీకరించారు.  ఈ సందర్భంగా భారత్‌లో కరోనావైరస్‌ టీకా తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆంగ్లవార్తా సంస్థ రాయిటార్స్‌తో పేర్కొన్నారు. ఈ సమావేశంలో అమెరికా ఔషధ సంస్థలైన నోవావ్యాక్స్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లకు భారత్‌ సంస్థలు టీకాలు తయారు చేసేలా ఒప్పందం జరిగే అవకాశం ఉంది.

టీకాల తయారీలో వేగాన్ని గణనీయంగా పెంచడం, ప్రస్తుత లక్ష్యాల్లో జాప్యాన్ని తగ్గించడం వంటి చర్యలతో కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా మ్యుటేషన్లకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంత వేగంగా ఉంటే.. మ్యుటేషన్లను అంత తగ్గించ వచ్చని సదరు అమెరికా అధికారి పేర్కొన్నారు. అంతేకాదు.. భారత్‌లో అధికంగా ఉత్పత్తి అయిన టీకాలను దక్షిణాసియా దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి వినియోగించాలని భావిస్తన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం జరిగే క్వాడ్‌ దేశాధినేతల వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొంటారని నిన్న శ్వేతసౌధం ప్రతినిధి జెన్‌సాకీ ధ్రువీకరించారు. ఈ సమావేశంలో చైనా సైనిక, ఆర్థిక శక్తి దుర్వినియోగాన్ని కట్టడి చేయడంపై వీరు చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని