UP polls: యూపీ భాజపాలో కరోనా కలకలం

ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ) భాజపా వర్గాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర భాజపా ఇంఛార్జి రాధా మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆయన హాజరైన సమావేశంలో పార్టీ పెద్దలంతా పాల్గొన్నారు. వారిలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యూపీ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్‌ సింగ్‌ ఉన్నారు.  

Updated : 11 Jan 2022 12:44 IST

 రాధా మోహన్‌సింగ్‌కు పాజిటివ్‌.. ఆయనతో సమావేశంలో పాల్గొన్న యూపీ సీఎం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర భాజపా ఇన్‌ఛార్జి రాధా మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆయన హాజరైన సమావేశంలో పార్టీ పెద్దలంతా పాల్గొన్నారు. వారిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యూపీ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్‌ సింగ్‌ కూడా ఉన్నారు.

భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, యూపీ ఇన్‌ఛార్జి రాధా మోహన్ సింగ్‌కు మంగళవారం ఉదయం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న తరుణంలో నిన్న రాత్రి అక్కడి పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. రాధా మోహన్‌ సింగ్ పక్కనే స్వతంత్ర దేవ్ సింగ్‌,  ఆ పక్కనే ఆదిత్యనాథ్ కూర్చొని కార్యాచరణపై చర్చించారు. రాధామోహన్ సింగ్‌(నీలం రంగు దుస్తులు ధరించిన వ్యక్తి) షేర్ చేసిన ఫొటోలను బట్టి ఆ విషయం వెల్లడవుతోంది.

ఇదిలా ఉండగా.. ఈ రోజు స్వతంత్రదేవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండటం గమనార్హం. మరోపక్క ఈ ఎన్నికల నిమిత్తమే  యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రి కేపీ మౌర్య తదితరులు భాజపా కోర్ కమిటీ సమావేశం కోసం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 

నిన్న సాయంత్రం ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అధిక ప్రమాదంలో ఉంటే తప్ప, కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని