Ratan Tata: రతన్‌జీకి ఉత్తేజాన్నిచ్చేది ఇదే..

టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌ టాటా యువతకు ఆదర్శంగా ఉంటారు. ఆయన చెప్పే మాటలు స్ఫూర్తినిస్తుంటాయి.

Updated : 27 Sep 2022 15:09 IST

ముంబయి: టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌ టాటా యువతకు ఆదర్శంగా ఉంటారు. ఆయన చెప్పే మాటలు స్ఫూర్తినిస్తుంటాయి. ఆయన వ్యాపార విలువలు ఎందరికో ఆచరణీయం. మరి, ఈయన్ని ఉత్తేజపరిచే అంశమేంటో తెలుసా..? తాజాగా ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తకు చెందిన వీడియో క్లిప్‌ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఆ విషయాన్ని వెల్లడించారు. దానిని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.

‘మేమిది చేయలేకపోయామన్న మాట మనం వింటుంటాం. అయితే ఆ పనిని చేయడానికి ప్రయత్నించడమే నన్ను అమితంగా ఉత్తేజపరిచే అంశం’ అని టాటా అనడం ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తోంది. ఆయన స్ఫూర్తి వాక్యం ప్రతిఒక్కరినీ మెప్పించింది. రతన్‌ టాటా మీరు లెజెండ్ అంటూ నెటిజన్లు స్పందించారు. ‘నిజమే. లక్ష రూపాయల్లో కారు తయారు చేయడం సాధ్యం కాదని ఆటోమొబైల్ వర్గాలు టాటాకు చెప్పినప్పుడు.. ఆయన వెనకడుగు వేయకుండా  అసాధ్యాన్ని చేసి చూపించారు. వారి మాటలను తప్పు అని నిరూపించారు’ అని మరో యూజర్ రాసుకొచ్చారు. మధ్యతరగతి వర్గం కోసం లక్ష రూపాయల్లో టాటా నానో కారును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని