ఆ పాపకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌..

ముంబయిలో అరుదైన వ్యాధి(స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోపీ)తో బాధపడుతున్న చిన్నారి టీరాకు ఎట్టకేలకు చికిత్స మొదలైంది.

Published : 28 Feb 2021 09:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయిలో అరుదైన వ్యాధి(స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోపీ)తో బాధపడుతున్న చిన్నారి టీరాకు ఎట్టకేలకు చికిత్స మొదలైంది. ఈ మేరకు సుమారు రూ.16 కోట్ల రూపాయల విలువైన ‘జోల్‌జీన్‌స్మా’ ఇంజెక్షన్‌ను ఆ పాపకు అందించారు. ఈ వ్యాధిపై పోరుకు ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ ద్వారా నెటిజన్లు రూ.16కోట్లు విరాళాలు అందించడం విశేషం. ఈ వ్యాధికి భారత్‌లో చికిత్స, ఔషధాలు అందుబాటులో లేవు. 
అతి ఖరీదైన మందులను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీనికి గాను సుమారు రూ.16కోట్ల రూపాయలు అవసరమవ్వగా ఆ చిన్నారి తల్లిదండ్రులు  ప్రియాంక, మిహిర్‌ కామత్‌ ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ ద్వారా సేకరించారు. ఇంజెక్షన్‌ దిగుమతికి గాను ఎక్సైజ్‌ సుంకం సహా.. జీఎస్టీని కేంద్రం రద్దు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని కార్యాలయం సుమారు 6.5 కోట్ల రూపాయల మేర సుంకాలు రద్దు చేసి చేయూతను అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 11 మంది పిల్లలకు ‘జోల్‌జీన్‌స్మా’ ఇంజెక్షన్‌ ఇచ్చారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని