China Rocket: చైనా రాకెట్ శకలాల భయం.. స్పెయిన్‌లో ఎయిర్‌పోర్టులు మూసివేత
తియాంగాంగ్ పేరుతో నిర్మిస్తోన్న స్పేస్ స్టేషన్ కోసం చైనా గత సోమవారం చివరి మాడ్యూల్‌ను 23 టన్నుల బరువున్న లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా భూమి నుంచి పంపించింది. మాడ్యూల్‌ను సురక్షితంగా లక్షిత స్థానానికి చేర్చిన లాంగ్ మార్చ్ 5బీ తిరిగి భూమిపై పడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ శకలాలు నియంత్రణ లేకుండా భూమిపై పడనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పిన అంచనాలతో పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తమ దేశ గగనతలంతో పాటు స్పెయిన్ వ్యాప్తంగా ఉన్న అనేక విమానాశ్రయాలను మూసివేసింది.
‘‘చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ శకలాలు స్పెయిన్ గగనతలాన్ని దాటుకుంటూ వెళ్లే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడ్డాయి. అందువల్ల కాటలోనియా, ఇతర ప్రాంతాల్లో విమానాల రాకపోకలను నిలిపివేశాం’’ అని స్పెయిన్‌లోని కాటలోనియా పౌర రక్షణ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎయిర్‌పోర్టులను మూసివేయడంతో పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాల ఆలస్యంపై ప్రజలకు సమాచారం ఇచ్చామని, దీనికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తియాంగాంగ్ పేరుతో చైనా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తోంది. దీని కోసం డ్రాగన్ గత సోమవారం చివరి మాడ్యూల్‌ను 23 టన్నుల బరువున్న లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా భూమి నుంచి పంపించింది. మాడ్యూల్‌ను సురక్షితంగా లక్షిత స్థానానికి చేర్చిన లాంగ్ మార్చ్ 5బీ.. శనివారం రాత్రి లోపు తిరిగి భూ వాతావరణంలో ప్రవేశించనుంది. దాదాపు 10 అంతస్తుల భవనమంతా పెద్దగా ఉండే ఈ రాకెట్ భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోతుంది. మరికొన్ని ప్రధాన భాగాలు మాత్రం అలాగే భూమిపై పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, అవి నిర్దిష్టంగా ఎక్కడ పడతాయన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!