Suhaildev Express: పట్టాలు తప్పిన సుహేల్‌దేవ్‌ ఎక్స్‌ప్రెస్‌

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సుహేల్‌దేవ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. 

Updated : 01 Nov 2023 01:58 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌కు వెళ్తొన్న సుహేల్‌దేవ్‌ ఎక్స్‌ప్రెస్‌ (Suhaildev Express) రైలుకు చెందిన ఇంజిన్‌, 2 బోగీలు పట్టాలు తప్పాయి. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలవలేదని నార్త్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాగ్‌ రాజ్‌ రైల్వే స్టేషన్‌లో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాత రైలు బయలుదేరిన కాసేపటికే  రైలు ఇంజిన్‌, దాని వెనుకున్న 2 బోగీలు పట్టాలు తప్పాయని తెలిపారు. కొన్ని గంటల్లోనే రైలును పునరుద్ధరించామని, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు