Marriage: సామూహిక వివాహాలు.. ఒక్కటైన 300 జంటలు

గుజరాత్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 300 జంటలు ఒక్కటయ్యాయి.

Updated : 06 Dec 2021 12:00 IST

గుజరాత్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 300 జంటలు ఒక్కటయ్యాయి. వేద మంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీపీ సవానీ గ్రూప్‌ అధినేత మహేశ్‌ సవానీ చొరవతో నవ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సూరత్‌ జిల్లాలో డిసెంబర్‌ 4, 5 తేదీల్లో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో వీరి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 4 వేలకు పైగా జంటలు ఒక్కటయ్యాయని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా 4000 మందికి పైగా ఆడపిల్లలకు పెంపుడు తండ్రిగా మారి కన్యాదానం జరిపించినందుకు గర్వపడుతున్నానని మహేశ్‌ సవానీ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని