సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. 500 మంది పర్యాటకులను రక్షించిన సైన్యం

సిక్కింలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి, రోడ్లపై అడ్డంకులు ఏర్పడటం వల్ల చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను సైన్యం రక్షించింది.

Published : 20 May 2023 23:20 IST

గ్యాంగ్‌టక్‌: సిక్కింలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి, రోడ్లపై అడ్డంకులు ఏర్పడటం వల్ల చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను సైన్యం రక్షించింది. వీరిలో 54 మంది చిన్నారులు, 113 మంది మహిళలు ఉన్నారు. ఉత్తర సిక్కింలో శుక్రవారం భారీ వర్షాలు పడ్డాయి. లాచుంగ్‌, లాచెన్‌ లోయకు వెళుతున్న 500 మంది పర్యాటకులు చుగ్టాంగ్‌ వద్ద చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడటం వల్ల వారు ఎటూ కదలలేని పరిస్థితి తలెత్తింది. బాధితులను రక్షించి, మూడు సైనిక శిబిరాలకు తరలించామని రక్షణ శాఖ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వీరికి ఆహారం, దుస్తులు, వైద్యం అందించినట్లు వివరించారు. బాధితులకు వసతి కల్పించడానికి సైనికులు తమ బ్యారక్స్‌ను ఖాళీ చేశారని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని