Anand Mahindra: సోప్‌ లిక్విడ్‌తో ట్రెడ్‌ మిల్.. అవార్డు నీకే అంటూ మహీంద్రా ట్వీట్‌

నిత్యం సరికొత్త సందేశాలను షేర్ చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). తాజాగా ఆయన చేసిన పోస్టు ఆకట్టుకుంటోంది. 

Published : 07 Jan 2023 14:22 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) చేసే పోస్టుల్లో హాస్యానికి కొదవుండదు. స్ఫూర్తి నింపే సందేశాలకు లోటుండదు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో కూడా ఆ తరహాలోనిదే. అందుబాటులో సౌకర్యాలు లేవని చింతించకుండా ఓ యువకుడు చేసిన ఆలోచన ఆశ్చర్యపరుస్తోంది. 

ఈ వీడియోలో యువకుడు వ్యాయామం చేయాలనే ఆలోచనను విరమించుకోకుండా.. సరికొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిమిషాల వ్యవధిలో ట్రెడ్‌మిల్‌(Tread mill)ను రూపొందించుకున్నాడు. వంటగదిలోకి వెళ్లి.. కొంచెం సోప్‌ లిక్విడ్ తీసుకొని నేలపై వేశాడు. తర్వాత దానిపై నీళ్లు చల్లి, కావాల్సినంత మేర ఆ ప్రాంతంలో కాలుతో స్ప్రెడ్ చేశాడు. ఇక అక్కడ కబోర్డులను హ్యాండిల్‌ మానిటర్‌లా ఉపయోగించుకున్నాడు. నిజంగానే ట్రెడ్‌మిల్లుపై ఉన్నట్లు తన కావాల్సిన వేగాన్ని సెట్‌ చేసుకుంటూ వ్యాయామాన్ని కొనసాగించాడు. ఈ వినూత్న ప్రయత్నం మహీంద్రాను మెప్పించింది. ‘ప్రపంచంలోనే అత్యంత చౌకైన ట్రెడ్‌మిల్‌ ఇది. అలాగే ఈ ఏడాది ఇన్నోవేషన్ అవార్డు ఇతడికే’ అంటూ వ్యాఖ్యను జోడించారు. 

అయితే దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘ట్రెడ్‌మిల్ మీద రన్నింగ్ మొదలు పెట్టాడు. మరి ఆపేదెలా..?’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది ప్రమాదకర ప్రయత్నంలా ఉందని మరొకరు రాసుకొచ్చారు. ఎంతైనా వ్యాయామాల విషయంలో నిపుణుల సలహా తీసుకుంటే మంచిదని మరికొందరు సూచించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని