JP Nadda: అమెరికా, చైనా, జపాన్‌లో అందుకే ఆర్థిక సంక్షోభం.. జేపీ నడ్డా ఏం చెప్పారంటే?

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP Chief JP Nadda) ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ విధానాలను కొనియాడారు. మోదీ పాలన దేశానికి ఎంతో మేలు చేస్తోందని చెప్పారు. 

Published : 17 May 2023 18:28 IST

ముంబయి: అమెరికా, జపాన్‌, చైనా వంటి దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం( Economic Crisis) ఎదుర్కోవడానికి గల కారణాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP Chief JP Nadda) వెల్లడించారు. అలాగే కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌ తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. మహారాష్ట్రలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 

‘కరోనా మహమ్మారి(COVID-19 pandemic) సమయంలో అమెరికా, చైనా, జపాన్‌ వంటి దేశాలు.. ఉచితాల(freebies)పై ఖర్చుచేశాయి. అందుకే అవి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఇతర రంగాలపై ఖర్చు చేసే లక్ష్యంతో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది’ అని నడ్డా అన్నారు. మోదీ(Modi) వంటి నేత భారత్‌కు ఉండటం వల్ల మేలు జరుగుతోందని చెప్పారు. 

అలాగే మహారాష్ట్ర( Maharashtra)లోని మునుపటి మహావికాస్‌ అఘాడీ(కాంగ్రెస్‌, శివసేన, ఎన్‌సీపీ)(MVA)ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ కూటమి పూర్తి అవినీతిమయమైనదని చెప్పారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ఆ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అన్ని పనులను నిలిపివేసిందని చెప్పారు. కానీ ఇప్పుడు ఏక్‌నాథ్‌ శిందే-దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని