
Joe Biden: కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్న జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి మూడో డోసును అమెరికా సీడీసీ, ఎఫ్డీఏ సిఫారసు చేసిన మరుసటి రోజే ఆయన ఫైజర్ మూడో డోసు తీసుకున్నారు. తన భార్య జిల్ బైడెన్ కూడా బూస్టర్ డోసు తీసుకున్నట్లు బైడెన్ తెలిపారు. టీకా వల్ల తమకు ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా అందరూ కచ్చితంగా టీకా వేసుకోవాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. కాగా అమెరికాలో కరోనా డెల్టా వేరియంట్ కారణంగా కొవిడ్ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న వారు బూస్టర్ డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని బైడెన్ సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.