Omicron: థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ఎందుకంత ప్రభావం..?

మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని కరోనా.. థర్డ్‌ వేవ్‌లో మాత్రం వారిపై అధికంగానే ప్రభావం చూపుతోంది. అయితే ఇందుకు కారణాలను వైద్య నిపుణులు విశ్లేషించారు........

Published : 14 Jan 2022 18:30 IST

ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌ ఏమన్నారంటే..!

దిల్లీ: తాజా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీంతో అనేక దేశాల్లో కొవిడ్‌ మూడో దశ మొదలైందని ఆయా దేశాల అధికారులు వెల్లడించారు. అయితే ఈ వేరియంట్‌ పిల్లలపైనా అధికంగానే ప్రభావం చూపుతుండటం భయాందోళన కలిగిస్తోంది. మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని కరోనా.. థర్డ్‌ వేవ్‌లో మాత్రం వారిపై అధికంగానే ప్రభావం చూపుతోంది. అయితే ఇందుకు కారణాలను వైద్య నిపుణులు విశ్లేషించారు. దిల్లీ ఎయిమ్స్‌ నిర్వహించిన ఓ సెమినార్‌లో.. ఎయిమ్స్‌ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ లోధా పలు విషయాలను పంచుకున్నారు.

ఒమిక్రాన్‌కు అత్యంత వ్యాప్తి కలిగే లక్షణాలు ఉండటం కారణంగా పిల్లలకు కూడా ఇది త్వరగా వ్యాపిస్తోందని లోధా వెల్లడించారు. దీనికి తోడు.. గతంతో పోలిస్తే అధికశాతం ప్రజలు నిబంధనలు పాటించకపోకపోవడం మరో కారణంగా చెప్పారు. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, రాష్ట్రాలు ఆంక్షలను సడలించడం మరికొన్ని కారణాలుగా పేర్కొన్నారు. అయితే వైరస్‌ బారిన పడే పిల్లల సంఖ్య గణనీయంగా పెరగలేదని, దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు.

‘పలు రుగ్మతులతో బాధపడుతున్న వారు మినహా.. ఇప్పటివరకు పిల్లలు వైరస్‌కు మెరుగైన రీతిలో స్పందించారు. అయితే డెల్టా కంటే ఓమిక్రాన్ తీవ్ర వ్యాప్తిని కలిగి ఉండటంతోపాటు ఆర్‌-వాల్యూ పెరిగిపోవడంతో పిల్లలపై ప్రభావం పడుతోంది. కొవిడ్‌ సోకి అమెరికాలోని ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. పిల్లలు అనారోగ్యం బారినపడటం ఆందోళనకు గురిచేస్తోంది’ అని రాకేష్ లోధా వివరించారు. అయితే భారత్‌లోని పరిస్థితులపై మరింత సమాచారం అవసరం అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని