దీపిక నవ్వుకు ఏథెన్స్‌ ఫిదా..!

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపిక పదుకొణె నవ్వుకు ఏథెన్స్‌ ఫిదా అయింది. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఓ ప్రదర్శన(ఎగ్జిబిషన్‌) ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన నవ్వు గల ప్రముఖుల విగ్రహాలను అందులో ప్రదర్శనకు ఉంచారు.

Published : 09 Dec 2020 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపిక పదుకొణె నవ్వుకు ఏథెన్స్‌ ఫిదా అయింది. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఓ ప్రదర్శన(ఎగ్జిబిషన్‌) ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన నవ్వు గల ప్రముఖుల విగ్రహాలను అందులో ప్రదర్శనకు ఉంచారు. అయితే.. బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణెకు అందులో చోటు లభించింది. ఆమె విగ్రహాన్ని కూడా విమానాశ్రయంలోని ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఈ విషయాన్ని దీపిక అభిమానులు సోషల్‌ మీడియా షేర్‌ చేస్తున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి ఆమె మాత్రం ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం. అయితే.. తన వివాహ రిసెప్షన్‌లో దీపిక ధరించిన నెక్లెస్‌, చీర ఆ విగ్రహంపై ఉండటం.. పైగా ఆ బొమ్మ కింది భాగంగా ‘బాలీవుడ్‌ నటి’ అని పేర్కొనడంతో పాటు అచ్చుగుద్దినట్లుగా దీపిక పోలీకలు ఉండటంతో అది కచ్చితంగా దీపిక పదుకొణె విగ్రహమేనని అభిమానులు భావిస్తున్నారు.

2018లో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ను పరిణయమాడిన తర్వాత దీపిక సినిమాలు తగ్గించింది. మేఘనా గుల్జర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఛపాక్‌’ చిత్రంలో యాసిడ్‌ బాధితురాలిగా దీపిక కనిపించింది. ప్రస్తుతం తన భర్త రణ్‌వీర్‌తో కలిసి నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘83’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1983లో ప్రపంచకప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఇదీ చదవండి..

మామిడికాయ పచ్చడేసుకుని జీవితాంతం తింటా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని