‘జబర్దస్త్‌’లోకి రాకేశ్‌ మాస్టర్‌ ఎంట్రీ

అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. కమెడియన్లు వేసే వరుస పంచులతో ఈ కామెడీ షో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యింది. అయితే వచ్చే గురువారం ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ ఎపిసోడ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

Published : 04 Nov 2020 11:14 IST

హైదరాబాద్‌: అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. కమెడియన్లు వేసే వరుస పంచులతో ఈ కామెడీ షో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యింది. అయితే వచ్చే గురువారం ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ ఎపిసోడ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

హైపర్‌ ఆది ఎప్పటిలాగానే తనదైన స్టైల్‌లో దొరబాబు, పరదేశీలపై వరుస పంచులతో జడ్జిలను ఆకట్టుకోనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. స్కిట్‌లో భాగంగా వెంకీ మంకీస్‌ టీమ్‌ ‘మగధీర’ స్ఫూప్‌తో అలరించనుంది. కాగా, తాగుబోతు రమేష్‌ స్కిట్‌ కోసం రాకేశ్‌ మాస్టర్‌ ‘జబర్దస్త్‌’ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో నరేష్‌ ఆయన్ని ఇమిటేట్‌ చేసి నవ్వులు పూయించనున్నారు. ఈ ఫన్‌, జోష్‌ ఫుల్‌ ఎపిసోడ్‌ చూసేయాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే. నవంబర్‌ 5న ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని