వెంటిలేటర్‌పై ‘దృశ్యం’ దర్శకుడు

దర్శకుడు, నటుడు నిషికాంత్‌ కామత్‌ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌

Published : 17 Aug 2020 14:35 IST

ముంబయి: దర్శకుడు, నటుడు నిషికాంత్‌ కామత్‌ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు. ఆయన చనిపోలేదని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

‘‘నిషికాంత్‌ కామత్‌ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన ఇంకా బతికే ఉన్నారు. మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దాం’’ అని ట్వీట్‌ చేశారు. అనంతరం కొద్దిసేపటికి మరో ట్వీట్ చేస్తూ, ‘‘మీడియా వర్గాలకు ఇదే నా విన్నపం. దయ చేసిన నిషికాంత్‌ కామత్‌ వార్తలపై నిజాలు తెలసుకుని ఇవ్వండి’’ అని పేర్కొన్నారు.

నిషికాంత్‌ చనిపోయాడని బాలీవుడ్‌ దర్శకుడు మిలాప్‌ ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించాడు. ‘‘ఆస్పత్రిలో నిషికాంత్‌తో ఉన్న వారితో ఇప్పుడే మాట్లాడాను. ఆయన చనిపోలేదు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు’’ అని మిలాప్‌ ట్వీట్ చేశారు.

బాలీవుడ్‌లో వచ్చిన ‘దృశ్యం’, ‘మదారి’, ‘ముంబయి మేరీ జాన్‌’ తదితర చిత్రాలకు నిషికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా పలు మరాఠీ చిత్రాల్లో నటించారు. 2005లో ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన ‘డాంబివాలీ’ మరాఠీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని