ప్రియాంక పుస్తకానికి భారీ డిమాండ్‌

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న కథానాయిక ప్రియాంకా చోప్రా. తను ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని.. నేడు ఈ స్థాయికి చేరినట్లు ఇప్పటికే పలుమార్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు తన జీవితాన్ని ఓ పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘అన్‌ఫినిష్డ్‌’ (Unfinished) టైటిల్‌తో పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. శుక్రవారం

Published : 04 Oct 2020 01:25 IST

అమెరికాలో అత్యధికంగా..

ముంబయి: బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న కథానాయిక ప్రియాంకా చోప్రా. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని.. నేడు ఈ స్థాయికి చేరినట్లు ఇప్పటికే పలుమార్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు తన జీవితాన్ని ఓ పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘అన్‌ఫినిష్డ్‌’ (Unfinished) టైటిల్‌తో పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలుపుతూ ప్రియాంక.. వీడియోలు షేర్‌ చేశారు. ప్రీ-బుకింగ్‌కు వెసులుబాటు కల్పించారు. దీనికి అమెరికాలో భారీ డిమాండ్‌ ఏర్పడింది. అక్కడి ప్రజలు పుస్తకాన్ని ముందస్తుగా బుకింగ్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో అక్కడ అత్యధికంగా ప్రీబుకింగ్‌లు పొందిన పుస్తకంగా ‘అన్‌ఫినిష్డ్‌’ నిలిచింది. ఇదే విషయాన్ని ప్రియాంక తన సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ.. తెగ సంబరపడ్డారు.

‘అన్‌ఫినిష్డ్‌’ ద్వారా ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఘనతలతోపాటు అందమైన సంఘటనల్ని కూడా పాఠకులకు తెలపబోతున్నారు. జంషెడ్‌పూర్‌లో జన్మించిన ప్రియాంక చిన్నతనంలోనే అమెరికా వెళ్లారు. అక్కడ తన బంధువుల ఇంట్లో ఉంటూ.. ఉన్నత పాఠశాలను పూర్తి చేశారు. అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్‌ ఇండియా’, ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాలు సొంతం చేసుకున్నారు. ఆపై నటిగా కెరీర్‌ ఆరంభించి, గాయనిగా కూడా అలరించారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమాలు తీశారు. అనేక ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జీవితం యువతకు స్ఫూర్తిదాయకం అనడంలో ఆశ్చర్యం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని