Sada Nannu Nadipe: అందమైన ప్రేమకథతో..
లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సదా నన్ను నడిపే’. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. వైష్ణవి పట్వర్దన్ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ
లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సదా నన్ను నడిపే’. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. వైష్ణవి పట్వర్దన్ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అన్ని శాఖలపై పట్టుతో హీరో ప్రతీక్ ముందడుగు వేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ సినిమాలో చక్కటి ప్రేమకథ ఉంది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి హైదరాబాద్‌లో అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడ ఫిల్మ్‌సిటీ ఉంది. ఐదేళ్లలో ముంబయి తరహా సినీ పరిశ్రమను హైదరాబాద్‌లో చూడొచ్చు. కేబినెట్ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ చిత్ర పరిశ్రమపై చర్చించారు. ఇండస్ట్రీకి ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉంది’’ అన్నారు. దర్శకుడు, హీరో ప్రతీక్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా రెండో చిత్రం. ‘గీతాంజలి’, ‘ప్రేమించుకుందాం రా’.. తరహాలో మంచి అందమైన ప్రేమకథతో రూపొందింది. ఫైట్స్, కామెడీ, రొమాన్స్.. ఇందులో ఉన్నాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ దాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్‌హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్