సోషల్‌ లుక్‌: పేరెంట్స్‌ ఫస్ట్‌.. ఫిట్‌నెస్‌ మస్ట్‌

ప్రతి రోజు సెల్ఫీలకు ఫోజులిచ్చే తారలు తమ తల్లిదండ్రులతో కలిసి సోషల్‌ మీడియాలో సందడి చేశారు. మంచు మనోజ్‌ తన తల్లితో.. ఐశ్వర్య రజనీకాంత్‌ తన తండ్రితో.. రాశీఖన్నా కూడా తన తల్లితో కలిసి సోషల్‌ మీడియాల్లో సందడి చేశారు. ఇక ఈరోజు మొత్తం రానా పుట్టినరోజు

Updated : 16 Dec 2020 14:53 IST

తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి రోజు సెల్ఫీలకు ఫోజులిచ్చే తారలు ఈరోజు తమ తల్లిదండ్రులతో కలిసి సోషల్‌ మీడియాలో సందడి చేశారు. మంచు మనోజ్‌ తన తల్లితో.. ఐశ్వర్య ధనుష్‌ తన తండ్రితో.. రాశీఖన్నా తన తల్లితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇక ఈరోజు నటుడు రానా పుట్టినరోజు పోస్టులు సోషల్ మీడియాను మోతమోగించాయి. కొంతమంది హీరోయిన్లు జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటోలను పంచుకున్నారు. ఇంకా ఎవరెవరు ఏయే పోస్టులు చేశారో చూసేయండి మరి..!

* సొట్టబుగ్గల చిన్నోడు, సినీ హీరో మంచు మనోజ్‌ తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టు చేశాడు. 
* తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. హీరో రానాకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 
* బాలీవుడ్‌ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ జిమ్‌లో కసరత్తు అనంతరం ఒక ఫొటో దిగి అభిమానులతో పంచుకుంది.
* సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తిరిగి సినిమా సెట్‌లో అడుగు పెట్టారు. హైదరాబాద్‌లో ఆయనతో మాట్లాడుతున్న ఫొటోను తన కూతురు సౌందర్య సోషల్ మీడియాలో పంచుకుంది.
* టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాశీఖన్నా.. తన తల్లితో ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
* తన తర్వాతి సినిమా కోసం తాప్సీ విపరీతంగా కష్టపడుతోంది. ఆమె వచ్చే చిత్రంలో క్రీడాకారిణిగా కనిపించనుంది.
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని