Aadavallu Meeku Johaarlu: కుటుంబంతో కలిసి రండి.. నవ్వుతూ బయటకు వెళ్లండి
శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ
శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దర్శకుడు తిరుమల కిషోర్ మాట్లాడుతూ ‘‘మహమ్మారి తర్వాత కుటుంబం.. పిల్లలతో కలిసి చూసే సినిమాని మిస్సయ్యాం. ఆ లోటును మా చిత్రం పూడుస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమాతో థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో మంచి ప్రేమకథ ఉంది. దీంట్లోని ప్రతి సీన్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ సీన్‌కు మహిళలు చప్పట్లు కొడతారని గట్టిగా చెప్పగలను’’ అన్నారు. ‘‘కుటుంబంతో సినిమాకు రండి. థియేటర్ నుంచి నవ్వుకుంటూ బయటకు వెళ్తార’’న్నారు నిర్మాత.
అబ్బాయిలా పుట్టాలి..
‘‘వచ్చే జన్మలో తాను కచ్చితంగా అబ్బాయిలా పుట్టాలని కోరుకుంటున్నాన’’ని చెప్పింది నటి రష్మిక. గురువారం విలేకర్ల సమావేశంలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సరదాగా ఇలా బదులిచ్చింది. ‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం పూర్తయ్యాక.. నేనొకటి బలంగా కోరుకున్నా. వచ్చే జన్మంటూ ఉంటే నేను కచ్చితంగా అబ్బాయిలాగే పుట్టాలి (నవ్వుతూ). ఎందుకంటే ఆ చీరలు కట్టుకోవడం.. పాత్రకు తగ్గట్లుగా హెయిర్ స్టైల్, లుక్స్ మెయింటైన్ చేయడం.. చాలా కష్టం అనిపించింది. అదే అబ్బాయి అయితే డ్రెస్సింగ్ కోసం ఇంత కష్టపడాల్సిన అవసరముండదు కదా’’ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పెళ్లి విషయమై స్పందించిన ఆమె.. మంచి మనసున్న వ్యక్తి దొరికితే చాలని, అయితే పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు