Tollywood: నెరవేరిన కల

‘‘సినిమా రంగంలో రాణించాలంటే ఇష్టం, పట్టుదలతోపాటు... తగిన ప్రణాళిక అవసరం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా పది సినిమాలైనా చేయాలనే లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నా’’ అన్నారు రమణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, సొంత సంస్థ సిరి మూవీస్‌ పతాకంపై  

Updated : 07 Apr 2022 12:04 IST

‘‘సినిమా రంగంలో రాణించాలంటే ఇష్టం, పట్టుదలతోపాటు... తగిన ప్రణాళిక అవసరం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా పది సినిమాలైనా చేయాలనే లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నా’’ అన్నారు రమణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, సొంత సంస్థ సిరి మూవీస్‌ పతాకంపై  నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ఎం.రమేష్‌, గోపి  దర్శకత్వం వహించారు. ఈ నెల 8న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా రమణ్‌ బుధవారం హైదరాబాద్‌లో  విలేకర్లతో ముచ్చటించారు. ‘‘చిరంజీవి సినిమాలు చూసి పెరిగాను. ఆ తపనతో పరిశ్రమకొచ్చా. అవకాశాల కోసం తిరిగా. పదిహేనేళ్ల తర్వాత స్వయంగా నిర్మిస్తూ కథానాయకుడిగా సినిమా చేశా. కామెడీతోపాటు, యాక్షన్‌, ప్రేమ, సందేశం మేళవింపుగా రూపొందింది. నా కలని నెరవేర్చిన చిత్రమిది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని