బాలీవుడ్‌లో కొత్త ప్రేమజంట.. ఆన్‌లైన్‌లో లీకైన ఫొటోలు

బాలీవుడ్‌కు చెందిన ఓ యువ నటీనటుల జంట ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఎంతోకాలం నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ తాజాగా రిలేషన్‌లోకి అడుగుపెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి.

Updated : 12 Jul 2023 20:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి అనన్యాపాండే (Ananya Pandey), నటుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌ (Aditya Roy Kapoor) ప్రేమలో ఉన్నారా? అంటే.. అవుననే అంటోంది బీటౌన్‌ మీడియా. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో కథనాలూ ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంటకు సంబంధించిన పలు ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ప్రస్తుతం స్పెయిన్‌ టూర్‌లో ఉన్న వీరిద్దరూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. అయితే, ఈ ఫొటోల్లో ఆదిత్య.. అనన్యను ఆలింగనం చేసుకుని.. చుట్టూ ఉన్న పరిసరాలను వీక్షిస్తూ దర్శనమిచ్చారు. వీటిని చూసిన నెటిజన్లు.. ‘బాలీవుడ్‌లో కొత్త ప్రేమజంట’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక, ఆదిత్య అంటే తనకు ఇష్టమని, అతడి లుక్స్‌ బాగుంటాయని గతంలో ఓ కార్యక్రమంలో అనన్య తెలిపారు. ఆ షో తర్వాత నుంచి ఈ జోడీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీలకు వీరిద్దరూ కలిసి వెళ్లడం.. ఫంక్షన్స్‌లోనూ సరదాగా మాట్లాడుకోవడం, డ్యాన్స్‌లు చేయడం వంటి ఫొటోలు గతంలో బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. తాజాగా లీకైన ఫొటోలతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ‘లైగర్‌’ తర్వాత అనన్య.. ‘డ్రీమ్‌గర్ల్‌ 2’, ‘కంట్రోల్‌’ వంటి ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ‘ఆషికి 2’తో  గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ‘ఓకే జాను’, ‘డియర్‌ జిందగీ’, ‘రాష్ట్ర కవచ్‌ ఓం’ వంటి సినిమాల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని