Akshay Kumar: పోరాటాల సూర్యవంశీ

అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా దర్శకుడు రోహిత్‌శెట్టి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సింగమ్‌ అగైన్‌’.

Updated : 06 Nov 2023 13:43 IST

జయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా దర్శకుడు రోహిత్‌శెట్టి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సింగమ్‌ అగైన్‌’. దీపిక పదుకొణె, కరీనా కపూర్‌, టైగర్‌ష్రాఫ్‌, అర్జున్‌కపూర్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గత ‘సింగమ్‌’ చిత్రాల్లోని హీరోలు అక్షయ్‌కుమార్‌, రణ్‌వీర్‌సింగ్‌లు ఇందులో కీలక అతిథి పాత్రలు పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ని దర్శకుడు ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రెండు చేతుల్లోని మెషిన్‌ గన్లు పేలుస్తూ.. హెలిక్యాప్టర్‌ నుంచి దూకుతున్నట్టుగా అందులో కనిపిస్తున్నారు అక్షయ్‌కుమార్‌. బ్యాగ్రౌండ్‌లో ఆయన గతంలో నటించిన ‘సూర్యవంశీ’ చిత్రంలోని మ్యూజిక్‌ వినపడుతోంది. ‘మా అభిమానులు ఏం కోరుకుంటున్నారో ‘సింగమ్‌ అగైన్‌’లో అదే చేస్తున్నాం. ‘సూర్యవంశీ’ విడుదలై రెండేళ్లు పూర్తయ్యాయి. అందులోని వీర్‌ సూర్యవంశీ మేం చేస్తున్న పోరాటంతో చేతులు కలుపుతున్నారు’ అంటూ వివరాల్ని జోడించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, జియో స్టూడియోస్‌, అజయ్‌ దేవగణ్‌, రోహిత్‌శెట్టి నిర్మిస్తున్న ఈ కాప్‌ యూనివర్స్‌ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదలవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు