bak: భయపెడుతూనే నవ్విస్తుంది.. బాక్
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ.
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. ఆమె ఏసీఎస్ అరుణ్ కుమార్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘బాక్’. ఖుష్బూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధాన పాత్రని పోషించారు. తమన్నా, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో ‘అరణ్మనై 4’గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. తమన్నా మాట్లాడుతూ ‘‘మహిళా శక్తిని చాటి చెబుతూ సినిమాలు తీసిన దర్శకుడు సుందర్.సి. ఆయన ఎంత మంచి దర్శకుడో చెప్పడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. రాశీ ఖన్నాని ‘బెంగాల్ టైగర్’ నుంచీ చూస్తున్నా. తన నిజాయతీ నాకు నచ్చుతుంది. ఇందులో ‘అయ్యయ్యో...’ పాట చేస్తున్నప్పుడు చాలా ఆస్వాదించాం. హిప్హాప్ తమిళ అద్భుతమైన సంగీతం అందించారు. కిచ్చా విజువల్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అవి తీయడం ఎంత కష్టమో ‘అరణ్మనై3’ సమయంలో తెలిసింది. ‘బాక్’ సినిమాకి గ్లామర్ మరింత పెరిగింది. తమన్నా ఇప్పటివరకూ చేయని ఓ కొత్త పాత్రలో కనిపిస్తారు. సుందర్.సి సర్కి ప్రేక్షకుల నాడి తెలుసు. హారర్, గ్లామర్, థ్రిల్, కామెడీ... ఇలా అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. కోవై సరళతో పనిచేయడం మంచి అనుభవం. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. వేసవికి తగ్గ సినిమా ఇది. కుటుంబమంతా కలిసి ఆస్వాదించేలా ఉంటుంది’’ అన్నారు. కోవై సరళ మాట్లాడుతూ ‘‘భయపెడుతూ నవ్వించే చిత్రమిది. చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంద’’న్నారు. ‘‘అరణ్మనై’ సిరీస్‌లో వచ్చే సినిమాల్ని చూడటానికి చిన్న పిల్లలతో కలిసి మహిళలు థియేటర్‌కి వస్తుంటారు. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకొచ్చే విషయంలో ‘బాక్’ మరో అడుగు ముందుకు వేస్తుంది’’ అన్నారు ఖుష్బూ. ఈ కార్యక్రమంలో నిర్మాత జాన్వి నారంగ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు నుంచి ఆరంభం
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
నేనేంటో నిరూపించుకోవడమే ముఖ్యం
‘‘కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాన’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కియారా అడ్వాణీ. తనదైన నటనతో మెప్పించే ఈ భామ.. ఇటీవలే కేన్స్ చిత్రోత్సవాల్లో మెరిసి సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. -
సంగీత పరిణామం... మనోహర ప్రయాణం
సంగీత సరిగమల సంద్రంలో.. పదాలే పడవలుగా ప్రయాణం చేస్తూ.. గొప్ప సంగీతకారులుగా ఎదుగుతారు కొందరు. అలా ఎదిగిన వారిలో ఏఆర్. రెహమాన్ ఒకరు. -
ఈసారీ వర్షం పడింది.. విజయమే
‘గం.. గం.. గణేశా’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్ శెట్టి తెరకెక్కించారు. -
దీపావళికి కంగువా..?
మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ తెరకెక్కిస్తున్నారు. -
వివాదంలో పాయల్ రాజ్‌పూత్
నటి పాయల్ రాజ్‌పూత్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో ప్రణదీప్ ఠాకూర్ దర్శక నిర్మాణంలో ‘రక్షణ’ (5వైస్) అనే చిత్రంలో నటించింది. -
పాత్ర కోసం నిజమైన బంగారం
భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ మిరాయ్
మంచు మనోజ్ వెండితెరపై కనిపించి 8ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడాయన ‘మిరాయ్’తో తిరిగి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్‌పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
నటి పాయల్ రాజ్‌పుత్ సోషల్‌మీడియా వేదికగా పెట్టిన పోస్టు సరైన నిర్ణయం కాదని నిర్మాతల మండలి పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
-
రేవ్ పార్టీ హైదరాబాద్‌లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!