Tollywood: పాన్ ఇండియా జోరు.. మెరుస్తోంది హిందీ తారల పేరు
ఓ మోస్తరు నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న సినిమా అయినా సరే... పాన్ ఇండియా హంగులు జోడిస్తున్న సమయమిది. మన చిత్రాలకి మార్కెట్లో ఉన్న డిమాండ్ అలాంటిది. పెద్దగా గుర్తింపు లేని యువ కథానాయకుల సినిమాలు సైతం పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటుతూ సొమ్ము చేసుకుంటున్నాయి.
తెలుగు అగ్రనటుల చిత్రాల్లో బాలీవుడ్ నటుల సందడి
ఓ మోస్తరు నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న సినిమా అయినా సరే... పాన్ ఇండియా హంగులు జోడిస్తున్న సమయమిది. మన చిత్రాలకి మార్కెట్లో ఉన్న డిమాండ్ అలాంటిది. పెద్దగా గుర్తింపు లేని యువ కథానాయకుల సినిమాలు సైతం పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక గుర్తింపున్న అగ్ర తారల సినిమాలైతే సరే సరి! అవి పట్టాలెక్కడానికి ముందే దేశవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటాయి. అందుకే ఆయా సినిమాల బృందాలు మొదట్లోనే ‘ఇది బహు భాషా చిత్రం, పాన్ ఇండియా స్థాయి చిత్రం’ అని చాటుతూ పలు భాషలకి చెందిన నటీనటులు తెరపై కనిపించేలా జాగ్రత్త పడుతుంటారు. తెలుగు సినిమాల్లో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ... ఇలా భిన్న భాషలకి చెందిన నటులు సందడి చేస్తున్నారంటే కారణం అదే. ఇప్పుడు కూడా కొన్ని కొత్త చిత్రాల విషయంలో హిందీ తారల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమాల్లో ఇతర భాషలకి చెందిన నటులు కనిపించడం కొత్తేమీ కాదు. కొత్తదనం కోసం తరచూ హిందీ మొదలుకొని మలయాళం వరకు పలు భాషలకి చెందిన నటుల్ని మన తెరపై చూపించేవారు దర్శకనిర్మాతలు. పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగాక ఆ ఉధృతి మరింతగా పెరిగింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో మన సినిమాలకి ఆదరణ భారీగా పెరిగింది. దాంతో సినిమాలోని ఏదో ఒక బలమైన పాత్ర కోసం హిందీ నటుల్ని ఎంపిక చేసుకోవడం పరిపాటిగా మారింది. కథానాయికలు, ప్రతినాయకులుగా హిందీ తారలే సందడి చేస్తున్నారు ఈమధ్య. ‘పుష్ప’ హిందీ మార్కెట్లో సంచలన విజయం సాధించింది. దాంతో ‘పుష్ప2’ కోసం ఓ ప్రముఖ హిందీ నటుడిని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో సినిమా వర్గాలు ఉన్నాయనే మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఏ విషయాన్నీ బయట పెట్టడం లేదు.
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కన్న కొత్త సినిమాలోనూ బాలీవుడ్ హంగులు కనిపించనున్నాయి. ప్రతినాయకుడు, కథానాయిక పాత్రల కోసం బాలీవుడ్ తారల్నే ఎంపిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు అనిల్. కథానాయికగా సోనాక్షి సిన్హాతోపాటు పలువురు భామలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం ఉంది కాబట్టి నటుల ఎంపికపై కసరత్తులు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విషయంలోనూ బాలీవుడ్ పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం కథానాయికగా మొదట అలియాభట్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమె గర్భం దాల్చడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కథానాయిక కోసం బాలీవుడ్‌వైపే సినీ వర్గాలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హిందీ తారలు సైతం తెలుగు సినిమాల్లో నటించడంపై ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నారు. దాంతో మన దర్శకనిర్మాతల పని మరింత సులభం అవుతోంది. సల్మాన్‌ఖాన్‌లాంటి కథానాయకుడు సైతం హాలీవుడ్‌కి వెళ్లడం కంటే కూడా దక్షిణాది సినిమాల్లో నటించడానికే ఇష్టపడతానని చెబుతున్నారు. మంచి అవకాశం అనిపిస్తే బాలీవుడ్ తారలు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారు.
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ (Harihara Veeramallu) కోసం ఇప్పటికే బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్‌తోపాటు, నర్గీస్ ఫక్రీల్ని ఎంపిక చేసుకుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా విషయంలో మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పేరు కూడా వినిపిస్తోంది. అర్జున్ రాంపాల్ బదులుగా బాబీ రంగంలోకి దిగుతారా లేక, ఆయనతోపాటు బాబీ కూడా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!
-
Movies News
Kangana Ranaut: ఎలాన్ మస్క్ ట్వీట్.. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలనుకుందంటూ కంగన కామెంట్
-
General News
Delhi liquor case: ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ కోసం మూడో రోజు వేట.. మామ, డ్రైవర్ లొంగుబాటు
-
Politics News
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. తెదేపా ఎమ్మెల్యేలపై దాడి!
-
Sports News
Surya Kumar Yadav: ‘సూర్య’ ప్రతాపం టీ20లకేనా?.. SKYని డీకోడ్ చేసేశారా?