ఈ మార్పులు చేయండి.. అలియా-రణ్‌వీర్‌ చిత్రబృందానికి సెన్సార్‌ సూచన

అలియాభట్‌, రణ్‌వీర్‌ కొత్త సినిమా ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani) కు సెన్సార్‌ కొన్ని మార్పులు సూచించింది. ఇంతకీ అవి ఏమిటంటే..

Published : 23 Jul 2023 16:53 IST

ముంబయి: బాలీవుడ్‌ నటీనటులు అలియాభట్‌ (Aliabhatt), రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) ప్రధానపాత్రల్లో నటించిన రీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani). కరణ్‌ జోహార్‌ దర్శకుడు. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకుంది. 2 గంటల 48 నిమిషాల నిడివి గల ఈ సినిమా పట్ల సెన్సార్‌ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందట. కేవలం చిన్న చిన్న మార్పులు మాత్రమే సూచించింది. ఈ మేరకు..

1. సినిమాలోని చాలా సన్నివేశాల్లో ఓ అభ్యంతరకర పదాన్ని ఉపయోగించగా.. ఆ పదాన్ని మరో విధంగా మార్చాలని తెలిపింది.

2. ‘బ్రా’ అనే పదాన్ని ‘ఐటమ్‌’గా మార్చాలి.

3. మద్యానికి సంబంధించిన ఓ ప్రముఖ బ్రాండ్‌ పేరును ‘బోల్డ్‌ మాంక్‌’గా మార్చాలి.

4. చట్టసభ, మమతా బెనర్జీని ఉద్దేశించేలా ఉన్న సంభాషణలను పూర్తిగా తొలగించాలి.

5. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫొటోకు సంబంధించిన సన్నివేశంలో కూడా మార్పులు చేయాలి.

సెక్రటరీతో రేఖ రిలేషన్‌ అంటూ ప్రచారం.. ఖండించిన రైటర్‌

సుమారు ఏడేళ్ల తర్వాత కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబనా ఆజ్మీ కీలకపాత్రలు పోషించారు. పంజాబీ కుటుంబానికి చెందిన రాఖీ (రణ్‌వీర్‌ సింగ్‌), బెంగాలీ ఫ్యామిలీకి చెందిన రాణీ (అలియాభట్‌) ప్రేమలో పడతారు. సంప్రదాయాలు వేరు కావడంతో వీరి వివాహానికి పెద్దలు ఆసక్తి చూపించరు. మూడు నెలల పాటు ఒకరి కుటుంబంతో మరొకరు జీవించాలని.. అలా, పెద్దల మనసు గెలిచి పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ ప్లాన్‌ చేస్తారు. మరి, రాఖీ-రాణీ ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యిందా? వీరి పెళ్లికి ఇరు కుటుంబ పెద్దలు అంగీకరించారా? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని