Driver Jamuna: థ్రిల్‌ పంచే ‘డ్రైవర్‌ జమున’

నటన ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తూ.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సాధించింది నటి ఐశ్వర్య రాజేష్‌. ఆమె ప్రధాన పాత్రలో పా.కిన్‌స్లిన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డ్రైవర్‌ జమున’. ఎస్‌.పి.చౌదరి నిర్మించారు. 

Updated : 08 Jul 2022 08:58 IST

నటన ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తూ.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సాధించింది నటి ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh). ఆమె ప్రధాన పాత్రలో పా.కిన్‌స్లిన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డ్రైవర్‌ జమున’ (Driver Jamuna). ఎస్‌.పి.చౌదరి నిర్మించారు. ఆడుకలం నరేన్‌, శ్రీ రంజని, అభిషేక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రైలర్‌ విడుదల చేశారు. ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా కుటుంబానికి అండగా నిలిచేందుకు క్యాబ్‌ డ్రైవర్‌గా మారుతుంది జమున. అయితే ఒక రైడ్‌ ఆమె  జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఒకసారి తన క్యాబ్‌లో నేర నేపథ్యం ఉన్న కొందరు వ్యక్తులు ప్రయాణిస్తారు. వారి వల్ల జమున జీవితం ప్రమాదంలో    పడుతుంది. మరి వారి నుంచి ఆమె ఎలా బయటపడింది? ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ‘‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. రోడ్‌ జర్నీ సినిమాగా ఉంటుంది. జమునగా ఐశ్వర్య నటన కట్టిపడేస్తుంది. ఆమె ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కారు నేర్చుకొంది. డూప్‌ లేకుండా నటించింది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: గోకుల్‌ బెనోయ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని