Macherla Niyojakavargam: ‘మాచర్ల నియోజకవర్గం’లో కలెక్టర్‌ యాక్షన్‌

నితిన్‌ కథానాయకుడిగా ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి,  కేథరిన్‌ కథానాయికలు. బుధవారం నితిన్‌ 

Updated : 07 Dec 2022 19:41 IST

నితిన్‌ కథానాయకుడిగా ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి,  కేథరిన్‌ కథానాయికలు. బుధవారం నితిన్‌  పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ ఎటాక్‌ (టీజర్‌)ను విడుదల చేశారు. ఎలాంటి సంభాషణలు లేకుండా ఓ శక్తిమంతమైన పోరాట ఘట్టాన్ని ఈ ప్రచార చిత్రంలో  చూపించారు. పులివేషాల్లో ఉన్న కొందరు రౌడీలు వేట కొడవళ్లతో నితిన్‌పై దాడి చేయగా.. ఆయన తనదైన శైలిలో వారి నుంచి తప్పించుకొని ఎదురు దాడి చేయడం టీజర్‌లో కనిపించింది. రాజకీయ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ఇందులో నితిన్‌ కలెక్టర్‌గా సిద్ధార్థ్‌ రెడ్డి అనే పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వర సాగర్‌, ఫైట్స్‌: వెంకట్‌, కూర్పు: కోటగిరి  వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని