Kannappa: కన్నప్ప కామిక్‌ బుక్‌ విడుదల

కన్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని  ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా ‘కన్నప్ప’  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 21 Mar 2024 10:59 IST

న్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని  ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా ‘కన్నప్ప’  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. మంగళవారం జరిగిన మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల్లో, ఆయన చేతులమీదుగానే  కన్నప్ప కామిక్‌ బుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘కన్నప్ప కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్‌ పుస్తకం సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాల్ని తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అవుతుంది. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పనికాదు.  ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది’’ అన్నారు. ‘కన్నప్ప’ తదుపరి షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: షెల్డన్‌ చౌ, యాక్షన్‌: కేచా, నృత్యాలు: ప్రభుదేవా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని