ఈయన 33 ఏళ్ల జీవితాశయం పెళ్లి చేసుకోవడం!

నవీన్‌ చంద్ర, సలోని లూత్రా హీరోహీరోయిన్లుగా నటించిన వెబ్ చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కృష్వి ప్రొడక్షన్స్‌ పతాకంపై య‌శ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కథానాయిక కీర్తి సురేశ్‌  విడుద

Published : 24 Jun 2020 01:31 IST

హైదరాబాద్: నవీన్‌ చంద్ర, సలోని లూత్రా హీరోహీరోయిన్లుగా నటించిన వెబ్ చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కృష్వి ప్రొడక్షన్స్‌ పతాకంపై య‌శ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కథానాయిక కీర్తి సురేశ్‌  విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

‘దీని పేరు భానుమతి అప్పుడెప్పుడో ‘సీతాకోకచిలుక’ సినిమా సెకండ్‌ రిలీజ్‌ అప్పుడు పుట్టింది. దీంతోపాటు చదువుకున్న అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి..’ అంటూ సరదా డైలాగ్స్‌తో టీజర్‌ ఆరంభమైంది. ఆ తర్వాత కథానాయకుడు నవీన్‌ చంద్రను కూడా ఇదే విధంగా పరిచయం చేశారు. ‘వీడి 33 ఏళ్ల జీవిత ఆశయం పెళ్లి చేసుకోవడం..’ అంటూ వచ్చిన డైలాగ్‌ను బట్టి ఈ సినిమా కథ ‘భానుమతి రామకృష్ణ’ల మధ్య ప్రేమ, వివాహం నేపథ్యంలో సాగేలా తెలుస్తోంది. వినోదాత్మకంగా రూపొందించిన చిత్ర టీజర్‌ వీక్షకుల్ని నవ్విస్తోంది. జులై 3న ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని