F3: ‘ఎఫ్‌3’ హుషారు

పాటలతో ప్రచార హోరుని కొనసాగిస్తున్నాయి అగ్ర తారల సినిమాలు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ సినిమాలోని రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పాట ప్రోమోని బుధవారం విడుదల చేశారు.

Updated : 21 Apr 2022 10:53 IST

పాటలతో ప్రచార హోరుని కొనసాగిస్తున్నాయి అగ్ర తారల సినిమాలు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ సినిమాలోని రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పాట ప్రోమోని బుధవారం విడుదల చేశారు. ఆ ప్రోమో కలర్‌ఫుల్‌గా ప్రేక్షకుల్ని కనువిందు చేస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ గీతంలో నాయకానాయికలతోపాటు సునీల్‌ సందడి చేసినట్టు తెలుస్తోంది.


సల్మాన్‌ఖాన్‌ చిత్రంలో వెంకీ

వెంకటేష్‌ మరోసారి హిందీ తెరపై సందడి చేయనున్నారు. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర కోసం వెంకటేష్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ‘అనారి’ చిత్రంతో ఇదివరకు హిందీ ప్రేక్షకులకి సుపరిచితం వెంకటేష్‌. సల్మాన్‌ఖాన్‌తో ఆయనకి మంచి స్నేహమూ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని