Cinema News: థ్రిల్లర్‌ పంచే ‘ట్యాక్సీ’

వసంత్‌ సమీర్‌ పిన్నమరాజు, అల్మాస్‌ మోటివాలా, సూర్య శ్రీనివాస్‌, సౌమ్య మేనన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్యాక్సీ’. హరీష్‌ సజ్జా దర్శకుడు. హరిత సజ్జా నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా

Updated : 26 Jun 2022 06:41 IST

వసంత్‌ సమీర్‌ పిన్నమరాజు(Vasant Sameer Pinnamaraju), అల్మాస్‌ మోటివాలా, సూర్య శ్రీనివాస్‌, సౌమ్య మేనన్‌(Sowmya Menon) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్యాక్సీ’(Taxi). హరీష్‌ సజ్జా(Harish Sajja) దర్శకుడు. హరిత సజ్జా నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్‌(Krish) హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


విలువలతో ‘ఏనుగు’

అరుణ్‌విజయ్‌(Arjun Vijay), ప్రియభవానీ శంకర్‌(Priya Bhavani Shankar) జంటగా నటించిన చిత్రం ‘ఏనుగు’(Enugu). ‘సింగం’ సినిమాల ఫేమ్‌ హరి దర్శకత్వం వహించారు. సీహెచ్‌ సతీష్‌కుమార్‌ నిర్మించారు. జులై 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘సమాజంలో సమస్యల్ని స్పృశిస్తూనే వినోదం పంచే చిత్రమిది. ఇందులోని సందేశం ఆలోచింపజేస్తుంది. కుటుంబ విలువల్ని గొప్పగా ఆవిష్కరించే ఈ సినిమా... ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని