తెరపై బ్రూస్‌లీగా ఆస్కార్‌ దర్శకుడి తనయుడు

బ్రూస్‌లీ..యాక్షన్‌ సినిమా ప్రియులు మర్చిపోలేని పేరు. నటుడి గానే కాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం సాధించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ లెజెండరీ నటుడి జీవితం వెండితెరకు రాబోతుంది.

Published : 02 Dec 2022 02:23 IST

బ్రూస్‌లీ..యాక్షన్‌ సినిమా ప్రియులు మర్చిపోలేని పేరు. నటుడి గానే కాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం సాధించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ లెజెండరీ నటుడి జీవితం వెండితెరకు రాబోతుంది. దీనికి ప్రముఖ దర్శకుడు యాంగ్‌ లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘బ్రోక్‌ బ్యాక్‌ మౌంటైన్‌’ చిత్రాలతో ఆస్కార్‌ పురస్కారాలు గెలుచుకున్నారు. ఇప్పుడు బ్రూస్‌లీగా యాంగ్‌లీ తనయుడు మాసన్‌లీ నటిస్తున్నాడు ‘‘తన నిరంతరశ్రమతో అసాధ్యాలు ఎన్నింటినో సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరకి తీసుకురావడం ఆనందంగా ఉంది’’అని చెప్పారు యాంగ్‌లీ. ‘లాంగ్‌ హాఫ్‌ టైమ్‌ వాక్‌’, ‘ది హ్యాంగోవర్‌ పార్ట్‌ 2’, ‘స్టాండ్‌ బై మీ’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు మాసన్‌లీ.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని