తొలి రెండు స్థానాల్లో మనోళ్లే

ఆస్కార్‌ సందడి అట్టహాసంగా ముగిసింది. ఈసారి వేడుకలపై భారతీయ చిత్రాలు గట్టి ప్రభావమే చూపించాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ పురస్కారాలతో మెరిశాయి.

Published : 15 Mar 2023 06:08 IST

స్కార్‌ సందడి అట్టహాసంగా ముగిసింది. ఈసారి వేడుకలపై భారతీయ చిత్రాలు గట్టి ప్రభావమే చూపించాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ పురస్కారాలతో మెరిశాయి. ఆస్కార్‌ బరిలో నిలిచిన మన చిత్రాలు... అందులో నటించిన తారల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖంగా చర్చ జరిగింది. ఈ పరిణామం మన చిత్ర పరిశ్రమకి ఎంతో మేలు చేసేదే. ఆస్కార్‌ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో
ఎక్కువసార్లు ప్రస్తావనకొచ్చిన సినిమాగా మన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. ఆ సినిమాలో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కూడా ఎక్కువసార్లు ప్రస్తావించిన నటుల జాబితాలో వరుసగా తొలి రెండు స్థానాల్ని కైవసం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్ని విశ్లేషించే సంస్థలు ఈ గణాంకాల్ని వెల్లడించాయి. ఆస్కార్‌ ప్రదానోత్సవంలోనూ మన తారలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వాళ్లు ధరించిన దుస్తులు అంతర్జాతీయ స్థాయిలో చర్చని లేవనెత్తాయి.

మరోసారి సీక్వెల్‌ చర్చ

ఉత్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ గెలిచాక మరోసారి ఈ సినిమా సీక్వెల్‌ గురించి చర్చ మొదలైంది. ఆస్కార్‌ వేడుక అనంతరం దర్శకుడు రాజమౌళి ఓ ప్రశ్నకి బదులిస్తూ...
‘‘పురస్కారం మాలో ఉత్సాహాన్ని నింపింది. సీక్వెల్‌కి సంబంధించి స్క్రిప్ట్‌ పనుల్ని వేగవంతం చేయడంలో దోహదం చేస్తుంద’’ని స్పష్టతనిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని