పగలు గృహిణి.. రాత్రి గూఢచారి

తను పగలేమో గృహిణిగా  నవ్వులు పూయిస్తుంది. రాత్రేమో సంఘ విద్రోహుల భరతం పట్టే గూఢచారిగా పని చేస్తుంది.

Published : 27 Mar 2023 02:43 IST

తను పగలేమో గృహిణిగా  నవ్వులు పూయిస్తుంది. రాత్రేమో సంఘ విద్రోహుల భరతం పట్టే గూఢచారిగా పని చేస్తుంది. ఆమే ‘మిసెస్‌ అండర్‌కవర్‌’. రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న స్పై కామెడీ చిత్రమిది. అనుశ్రీ మెహతా దర్శకురాలు. వరుణ్‌ బజాజ్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 28న జీ5 ఓటీటీలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ‘ఆమె హోం మేకర్‌ కాదు.. బోన్‌ బ్రేకర్‌..’ అనే కామెంట్‌ని జోడించి ఇన్‌స్టాలో ట్రైలర్‌ని పంచుకుంది రాధికా ఆప్టే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని