Nara Rohit: వినాయక చవితికి ‘సుందరకాండ’

కథానాయకుడు నారా రోహిత్‌ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్‌ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్‌ పిక్చర్‌ ప్యాలస్‌ పతాకంపై సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 18 Apr 2024 11:56 IST

థానాయకుడు నారా రోహిత్‌ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్‌ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్‌ పిక్చర్‌ ప్యాలస్‌ పతాకంపై సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృతి వాఘని కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం విడుదల చేశారు. అందులో నారా రోహిత్‌ కాలేజీ విద్యార్థిలా ఓ చేతిలో పుస్తకం.. మరో చేతిలో మొక్క పట్టుకొని నడిచొస్తూ కనిపించారు. నిర్మాత సంతోష్‌ చిన్నపోళ్ల మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే రొమ్‌-కామ్‌ చిత్రమిది. ప్రతి వ్యక్తికి కనెక్ట్‌ అయ్యేలా జీవితంలో ఉండే అన్ని రకాల భావోద్వేగాల్ని చూపించే విధంగా ఉంటుంది. ఇప్పటికే సగంపైగా చిత్రీకరణ పూర్తయింది. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించిన పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రదీష్‌ ఎం.వర్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని