Nithiin: స్టైలిష్‌... ‘రాబిన్‌ హుడ్‌’

‘రాబిన్‌హుడ్‌’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది.

Updated : 18 Apr 2024 11:52 IST

‘రాబిన్‌హుడ్‌’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో నితిన్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై స్టైలిష్‌గా కూర్చొని కనిపించారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా కనిపించనున్నట్లు సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతమందిస్తున్నారు. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని