BheemlaNayak: చాలా రోజుల తర్వాత పవన్ గర్జన చూశా: హరీశ్ శంకర్
పవర్‌స్టార్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసిందది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్’ శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సోషల్‌మీడియాలో ఎక్కడ...
హైదరాబాద్: పవర్‌స్టార్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్’ శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా పవన్ మేనియా కనిపిస్తోంది. బొమ్మ సూపర్ హిట్ అంటూ నెటిజన్లు వరుస పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖులు సైతం ‘భీమ్లానాయక్’ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘భీమ్లానాయక్’ అదుర్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ‘భీమ్లానాయక్’పై రివ్యూ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత థియేటర్లలో పవన్ గర్జన చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. తమన్ మ్యూజిక్ సినిమాకి వెన్నెముక అని కామెంట్ చేశారు.
‘‘భీమ్లానాయక్’ పాత్రలో పవన్‌కల్యాణ్ సింహ గర్జన చేశారు. చాలా రోజు తర్వాత థియేటర్లలో ఆయన నట గర్జన చూడటం అద్భుతంగా ఉంది. గొప్ప పనితీరు కనబరిచిన సాగర్ కె.చంద్ర, త్రివిక్రమ్, నాగవంశీ మొత్తం టీమ్ అందరికీ అభినందనలు. తమన్ అందించిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బావా... నీ కెరీర్లోనే ఇది బెస్ట్ వర్క్. ప్రతి సన్నివేశాన్ని నువ్వు అర్థం చేసుకున్న విధానం, అందుకు అనుగుణంగా మ్యూజిక్ ఇచ్చిన తీరు బాగుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాదు.. బ్యాక్‌బోన్ ఆఫ్ భీమ్లా..! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావా..! ఇక, రానా.. నీలో నేను కేవలం డేనియల్ శేఖర్ని మాత్రమే చూశా. నువ్వు అదరగొట్టేశావు. సినిమాలో నీ రోల్ చూసిన తర్వాత.. ‘‘రానా .. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’’ ఇది మాత్రమే చెప్పాలని ఉంది’’ అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్‌లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్