Heart of Stone: నెట్‌ఫ్లిక్స్‌ యాక్షన్‌ మూవీ ‘హార్ట్‌ ఆఫ్ స్టోన్‌’లో అలియాభట్‌.. ట్రైలర్‌ చూశారా?

గాల్‌ గాడాట్‌, అలియా భట్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హార్ట్‌ ఆఫ్ స్టోన్‌’. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదలైంది.

Published : 19 Jun 2023 17:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నాకు దిగులులేదు. నేనేంటో చూపిస్తా. దాని అంతు చూస్తాను’ అంటోంది బాలీవుడ్‌ భామ అలియా భట్‌ (Alia bhatt). గాల్‌ గాడాట్‌తో కలిసి ఆమె నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ (Heart of Stone).  ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ టుడుమ్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘చార్టర్‌కు పవర్‌ అందించేది హార్టే.. దీంతో నేలను, నింగిని దున్నేయొచ్చు.. హార్ట్‌ నీ సొంతమైతే ఈ ప్రపంచమే నీది’ అంటూ సాగే సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ చార్టర్‌ ఏంటి? దానికి హార్ట్‌తో ఉన్న సంబంధం ఏంటి? దాన్ని ఎవరు హైజాక్‌ చేశారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌, తెలుగుతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు