Alia Bhatt: కెమెరానే నా లోకం..

మూడు పదుల వయసులోనే మెప్పించే నటనతో ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుంది అలియా భట్‌. తాజాగా తన ఖాతాలో ప్రతిష్ఠాత్మక జాయ్‌ అవార్డుల ‘హానరరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేకర్స్‌’ పురస్కారం చేర్చుకుంది.

Updated : 22 Jan 2024 10:58 IST

మూడు పదుల వయసులోనే మెప్పించే నటనతో ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుంది అలియా భట్‌. తాజాగా తన ఖాతాలో ప్రతిష్ఠాత్మక జాయ్‌ అవార్డుల ‘హానరరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేకర్స్‌’ పురస్కారం చేర్చుకుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఈ పురస్కారం స్వీకరిస్తూ.. తన సంతోషం పంచుకుంది. ‘ఈ అవార్డుకి ఎంపికవడం పట్ల గర్వంగా ఫీలవుతున్నా. సినిమా మాధ్యమం ద్వారా మాలాంటి వాళ్ల ప్రతిభను గుర్తిస్తూ, అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నా. నిజానికి నాకు సినిమాలే లోకం. అది తప్ప వేరే ప్రపంచం తెలియదు. ‘లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌’.. ఇవి నిత్యం నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఈ పూట రియాద్‌ నగరం ఇచ్చిన ఆ ప్రేమని తీసుకొని వెళ్తున్నా’ అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడింది. తను ప్రస్తుతం ‘జిగ్రా’ అనే సినిమాని నిర్మిస్తూ.. నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని