Boney Kapoor: ఆవేదనకు లోనైన నిర్మాత

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఆవేదనకు లోనయ్యారు. తౌక్టే తుపాన్‌ కారణంగా తనకు కలిగిన నష్టం గురించి ఆలోచిస్తుంటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘మైదాన్‌’....

Updated : 24 May 2021 10:50 IST

ఆలోచిస్తుంటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్‌

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఆవేదనకు గురయ్యారు. తౌక్టే తుపాన్‌ కారణంగా తనకు కలిగిన నష్టం గురించి ఆలోచిస్తుంటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. ఫుట్‌బాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అజయ్‌దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా, ‘మైదాన్‌’ ఆరంభించినప్పటి నుంచి ఒక్క సెట్‌ కోసమే బోనీ భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమా వల్ల తనకు ఎదురవుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుందని అన్నారు.

‘‘మైదాన్‌’ చిత్రాన్ని మేము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాం. ఆ సినిమా కోసం ఓ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌తో కూడిన భారీ సెట్‌ నిర్మించాం. అది నిర్మించడానికి భారీగా ఖర్చు పెట్టాను. సినిమా షూట్‌ ప్రారంభమైన కొన్నాళ్లకు గతేడాది లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల షూట్‌ నిలిపివేశాం. దాంతో సెట్‌ కూల్చివేయాల్సి వచ్చింది. కొంత నష్టం భరించాల్సి వచ్చింది. మరోసారి అదే సెట్‌ని పునఃనిర్మించాం. దీనికి సైతం భారీగానే ఖర్చు అయ్యింది. షూట్‌ ప్రారంభమవుతోంది అనుకునే సమయానికి కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కారణంగా మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. దాంతో షూట్‌ వాయిదా వేశాం. త్వరలోనే పరిస్థితి చక్కబడి సెట్‌లోకి అడుగుపెడతాం అనుకున్నాం. కానీ ఇంతలో తౌక్టే కారణంగా మా సెట్‌ మొత్తం ధ్వంసమైంది. ఆ విషయం తెలిసి నాకెంతో బాధగా అనిపించింది. ఇప్పటికే రెండుసార్లు దానిని నిర్మించాం. ఇప్పుడు మూడోసారి అదే సెట్‌ నిర్మించాలి. ఈ ఆటంకాలు, నష్టాల గురించి ఆలోచిస్తుంటే ఏడుపొచ్చేస్తోంది’ అని బోనీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని