Nidhhi agerwal: కల నెరవేరిన క్షణం.. ‘హరి హర వీరమల్లు’పై నిధి అగర్వాల్‌ పోస్ట్‌

పవన్‌ కల్యాణ్‌తో నటించడంపై నిధి అగర్వాల్ (Nidhhi agerwal) తన అనుభూతిని పంచుకుంది. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu)లోని ఫొటోను షేర్‌ చేసింది.

Updated : 17 Jul 2023 11:27 IST

హైదరాబాద్‌: పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan), క్రిష్‌ (Krish) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu). దీని అప్‌డేట్స్‌ కోసం పవన్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ నిధి అగర్వాల్ (Nidhhi agerwal) ఈ సినిమాపై పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం అది వైరలవుతుండగా.. నెటిజన్లు నిధికి థ్యాంక్స్‌ చెబుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.

తాజాగా పవన్‌ కల్యాణ్‌ తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సినీ రంగానికి చెందిన వారితో ఆయన ఇప్పటి వరకు దిగిన ఫొటోలతో ప్రత్యేక వీడియో రూపొందించి దానిని షేర్‌ చేశారు. అందులో ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్‌తో దిగిన ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసిన నిధి.. అది తన మొదటి సన్నివేశమని చెప్పింది. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి నటించడంపై తన అనుభూతిని పంచుకుంది. ఆయనతో కలిసి నటించడంతో తన కల నేరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. అద్భుతమైన చిత్రబృందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మండి.. మీరు త్వరలోనే థియేటర్లో అద్భుతాన్ని చూస్తారు’’ అంటూ పవన్‌ కల్యాణ్‌కు, క్రిష్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 

ఈ వారం థియేటర్‌లో ఏకంగా పది సినిమాలు.. మరి ఓటీటీలో?

ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని