Maamannan: ఓటీటీలోకి ‘మామన్నన్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన సినిమా ‘మామన్నన్‌’(తెలుగులో నాయకుడు). ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.

Published : 18 Jul 2023 16:01 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్‌’ (Maamannan). మారీ సెల్వరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్ తమిళంలో సూపర్‌ హిట్ అవ్వడంతో తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదల చేశారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో (Netflix) ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అన్నీ దక్షిణాది భాషల్లోనూ ఇది అలరించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన చివరి చిత్రంగా ‘మామన్నన్‌’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఫహాద్‌ ఫాజిల్‌, వడివేలు కీలక పాత్రల్లో నటించారు. కీర్తిసురేశ్‌ కథానాయిక. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు.

రష్మి అప్పుడు చెప్పిన సీన్‌ ఇదేనా? వైరల్‌గా మారిన ‘భోళా శంకర్‌’ స్క్రీన్‌ షాట్స్‌!

‘మామన్నన్‌’ కథేంటంటే:

అణగారిన వర్గానికి చెందిన మామన్నన్‌ (వడివేలు) తన మంచితనంతో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలు చేస్తుంటాడు. అతడి కుమారుడు వీరన్‌ (ఉదయనిధి స్టాలిన్‌) అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. కులవ్యవస్థ వల్ల చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. లీలా (కీర్తిసురేశ్‌)తో ప్రేమలో పడతాడు. సేవా కార్యక్రమాలు చేసే లీలాను అగ్రకులానికి చెందిన రత్నవేలు (ఫహాద్‌ ఫాజిల్‌) తరచూ ఇబ్బందులు పెడుతుంటారు. దీంతో, ఆమెకు సాయం చేసేందుకు మామన్నన్‌, వీరన్‌ రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? రత్నవేలుకు వాళ్లు ఎలా బుద్ధి చెప్పారు? అనే ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని