Nithiin: నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’ర్డినరీ

నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయిక. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 24 Jul 2023 14:05 IST

నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయిక. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘ఎక్స్‌ట్రా’ అనే పేరుని ఖరారు చేశారు. ఆర్డినరీ మ్యాన్‌... ఉపశీర్షిక. ఆదివారం ఈ సినిమా పేరుతో కూడిన పోస్టర్‌, లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. నితిన్‌ 32వ చిత్రమిది. ఇందులో ఆయన రెండు రకాల పాత్రలతో సందడి చేస్తారని లుక్‌ స్పష్టం చేస్తోంది. దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘పాత్ర ప్రధానమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. ‘కిక్‌’ తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపే పాత్ర ఇందులో ఉంటుంది. ప్రేక్షకుల్ని నవ్విస్తూ, ఆశ్చర్యపరుస్తూ ఓ విభిన్నమైన అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. నితిన్‌ ఇప్పటివరకూ చేయని ఓ సరికొత్త పాత్రలో కనిపిస్తారని సినీవర్గాలు తెలిపాయి. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని