Nithiin: ‘ఇష్క్‌’ కలయిక మరోసారి

వరస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడిన కథానాయకుడు నితిన్‌ మళ్లీ విజయాల బాట పట్టింది ‘ఇష్క్‌’ సినిమాతోనే. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది.

Updated : 18 Mar 2024 11:13 IST

రస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడిన కథానాయకుడు నితిన్‌ మళ్లీ విజయాల బాట పట్టింది ‘ఇష్క్‌’ సినిమాతోనే. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. రొమాంటిక్‌ డ్రామా కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 2012లో వచ్చిన ఆ చిత్రం తర్వాత మళ్లీ నితిన్‌ - విక్రమ్‌ కె.కుమార్‌ కలిసి సినిమా చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆ  కలయికలో సినిమా కోసం రంగం సిద్ధమైంది. ప్రస్తుతం నితిన్‌ ‘తమ్ముడు’, ‘రాబిన్‌హుడ్‌’ చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక నితిన్‌ - విక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఒక దఫా కథా చర్చలు పూర్తయినట్టు తెలిసింది. విక్రమ్‌ ఇటీవల ‘దూత’ వెబ్‌సిరీస్‌తో విజయాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు